ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి

అన్నమయ్య: రాజంపేట, బాలరాజు పల్లె చెయ్యేరు నదిలోకి ఈతకు వెళ్లిన 8 మంది MBA విద్యార్థులలో ముగ్గురు మృతి చెందారు. మృతులు గాలివారి పల్లెకు చెందిన సాంబత్తిన దిలీప్ (22), ఒంటిమిట్ట మండలం మటపంపల్లికి చెందిన కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22), కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం చిన్నప్ప వీధికి చెందిన పీణరోతు కేశవ (22)గా గుర్తించారు. దీనితో గ్రామంలో విషద చాయలు నెల్కొన్నాయి.