పార్కుల్లో పచ్చదనం పెంపుపై హార్టికల్చర్ అధికారి ప్రత్యేక దృష్టి
KMM: ఖమ్మం నగరంలోని పచ్చదనం, పార్కుల నిర్వహణపై హార్టికల్చర్ అధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గొల్లగూడెం నర్సరీ (డివిజన్-14) తో పాటు లకారం ట్యాంక్ బండ్, మినీ లకారం వాకర్స్ పారడైజ్ పార్కులను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్కుల్లో పచ్చదనం పెంపు, మొక్కల కత్తిరింపు, సుందరీకరణ పనులను సమీక్షించారు.