అమ్మ ఒడి వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

అమ్మ ఒడి వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

SRPT: అనంతగిరి మండలంలోని త్రిపురవరం ఆరోగ్య కేంద్రంలో 102 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ ఇమామ్ పాషా, ప్రోగ్రామ్ మేనేజర్ సలీం అమ్మ ఒడి వాహనాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఇమామ్ పాషా మాట్లాడారు. గర్భిణీలు చెక్‌ప్ల కోసం, నెలవారీ టీకాల కోసం, ప్రసవం తర్వాత సురక్షితంగా ఇంటికి చేరడానికి ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.