VIDEO: ‘ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి’

CTR: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వాసు కోరారు. పుంగనూరు పట్టణంలోని మండల కార్యాలయంలో సమావేశం జరిగింది. సచివాలయ సిబ్బంది, అధికారులు హాజరయ్యారు. ఇటీవల రసాయనాలు ఉపయోగించడం ఎక్కువైందన్నారు. సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. AD శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.