అలర్ట్.. రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: కందుకూరు టౌన్‌లోని బలిజపాలెం నందు లైన్ వర్క్ ఉన్నందు వలన ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు 11 కె.వి ఎల్ఐసి ఫీడర్ నందు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ ఫీడర్ పరిధిలో ఉన్నటువంటి పడమర వడ్డీ పాలెం, బలిజ పాలెం, రజక పాలెం, ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.