VIDEO: ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

యాదాద్రి: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సుమంగళీ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గురుపూజతో ప్రారంభించారు. శ్రీరాధా గోపి జన వల్లభ నిరంతర దివ్య దర్శనం, అన్న ప్రసాద వితరణ, కృష్ణ కథ, అభిషేకం, మహా హారతి వైభవంగా కొనసాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలో చిన్నారి నృత్యాలు భక్తులను అలరించాయి.