ఏసీ పేలి విశ్రాంతి ఉద్యోగి మృతి

ఏసీ పేలి విశ్రాంతి ఉద్యోగి మృతి

AKP: ఏసీ పేలి విశ్రాంతి ఉద్యోగి మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి పట్టణంలో రేబాక రామారావు జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ తన ఇంట్లో ఉన్న ఏసీ పేలడం వల్ల మంటలు దుస్తులకి అంటుకొని అతను అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.