లింగపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం
ELR: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లింగపాలెంలో ఏలూరు నుంచి HYD వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్ జూబ్లీనగర్ సమీపంలో బోల్తా పడింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.