లబ్ధిదారులతో కలసి ఇందిరమ్మ గృహప్రవేశం
WGL: పర్వతగిరి మండలం గుగులోత్ తండా గ్రామంలో గురువారం చందు నాయక్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించడానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.