జీహెచ్ఎంసీలో మోడల్ ఫుట్ పాత్
HYD: జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్ పాత్ అభివృద్ధి పనులను ప్రారంభించింది. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు 1500 మీటర్ల మేర ఈ పనులు చేయనుంది. ఇందులో ఎడమవైపు 1000 మీటర్లు, కుడివైపు 500 మీటర్ల మీద అభివృద్ధి పనులు చేస్తారు. కాగా, ఈ పనులను రూ.1.68 కోట్లతో నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు.