VIDEO: ఎస్పీ ఆధ్వర్యంలో 5కే మారథాన్
ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇవాళ ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది గిరిజన యువతతో వంజంగి మేఘాల కొండ వద్ద 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. కష్టపడి చదువుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.