కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

MDK: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.