జిల్లాకు 12 కొత్త విద్యుత్తు సబ్ స్టేషన్లు ఏర్పాటు

జిల్లాకు 12 కొత్త విద్యుత్తు సబ్ స్టేషన్లు ఏర్పాటు

సత్యసాయి: జిల్లాలో విద్యుత్తు సమస్యలు లేకుండా ప్రజలు, రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు 12 కొత్త విద్యుత్తు సబ్ స్టేషన్ల ఏర్పాటు చర్యలు చేపట్టామని సీఎండీ సంతోష్ రావు తెలిపారు. ఆయన పుట్టపర్తి సమీప చింతతోపు, వెంగళమ్మ చెరువుల్లో స్థలాలను పరిశీలించారు. స్థల సేకరణ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.