ఆలయాలకు ఎందుకు వెళ్లాలంటే..?

ఆలయాలకు ఎందుకు వెళ్లాలంటే..?

ఆలయాలకు వెళ్లడం, అక్కడ కొలువుదీరిన దేవతామూర్తులను పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగం. ఆలయాల గర్భగుడి చుట్టూ ఉండే శక్తిమంతమైన తరంగాలు మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల శక్తిని నింపుతాయి. గంట శబ్దం, హారతి, పూల పరిమళం, చెప్పులు లేకుండా నడవడం, కుంకుమ వాడకం వంటివి మన పంచేంద్రియాలను జాగృతం చేసి ఏకాగ్రతను పెంచుతాయి. శాంతి, ఆరోగ్యం కోసం ఆలయాల సందర్శన చాలా అవసరం.