'ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి'
ASF: ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ నందు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై రిటర్నింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు.