ఖోఖో బాలికల జిల్లా విజేతగా కోహీర్

ఖోఖో బాలికల జిల్లా విజేతగా కోహీర్

SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో బాలికల అండర్- 14 విజేతగా కోహిర్ మండలం నిలిచింది. 29 మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులతో హోరాహోరీగా ఆడిన కోహిర్ మండలం బాలికలు ఫైనల్లో విజయం సాధించారు. విజయం సాధించిన క్రీడాకారులకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ బహుమతులు అందజేశారు.