ఇండస్ట్రీయల్ పార్క్ శంకుస్థాపనకు తరలిరావాలి: మంత్రి

ఇండస్ట్రీయల్ పార్క్ శంకుస్థాపనకు తరలిరావాలి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం గ్రామంలో శనివారం రూ.11.5కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి కూటమి నేతలు తరలిరావాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.