'ఐటీఐల్లో సమస్యలు పరిష్కరించాలి'
అనకాపల్లి జిల్లాలో గల ప్రైవేట్ ఐటీఐల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఐటిఐ కన్వీనర్‌కు బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్ వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల నుంచి వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సరియైన ఫ్యాకల్టీ లేదన్నారు.