గాల్లోకి డబ్బులు విసిరిన పోలీస్ అధికారి

గాల్లోకి డబ్బులు విసిరిన పోలీస్ అధికారి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీస్ అధికారి సొమ్మును గాల్లోకి విసిరి పారిపోయారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఒక కేసు విషయంలో ఏఎస్‌ఐ రాకేశ్ శర్మ ఒక వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు పట్టుకున్నారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఆ సొమ్మును గాల్లోకి విసిరాడు. ఈ క్రమంలో రోడ్డుపై పడ్డ ఆ నోట్లును తీసుకునేందుకు జనం పరుగులు తీశారు.