ప్రెస్ క్లబ్ అక్రమాలపై విచారణ జరపాలని కలెక్టర్‌కు వినతి

ప్రెస్ క్లబ్ అక్రమాలపై విచారణ జరపాలని కలెక్టర్‌కు వినతి

హన్మకొండ: కాలం చెల్లిన వరంగల్ గ్రేటర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని రద్దుచేసి తిరిగి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ టీయూడబ్ల్యూజే-143 యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కార్యవర్గ అక్రమాలపై విచారణ జరపాలని కోరారు.