నేడు లక్ష్మీనరసింహ స్వామి తెప్పోత్సవం కార్యక్రమం
E. G: కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. క్షీరాబ్ది ద్వదశి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ వెనుక ఉన్న దేవుని కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం హంస వాహనంపై జరగనుంది. అన్నవరం దేవస్థానం అధికారుల సంరక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.