VIDEO: ఈ నెల 12న అమలాపురంలో మహా యజ్ఞం
కోనసీమ: ఈ నెల 12న అమలాపురం పట్టణంలో ఉన్న చెన్న మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో లిఖించిన 33 కోట్ల శ్రీ రామ నామ జప మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ బుధవారం వీహెచ్పీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.