కర్రతో అత్తపై అల్లుడు దాడి.. అత్త మృతి

కర్రతో  అత్తపై అల్లుడు దాడి.. అత్త మృతి

అన్నమయ్య: అత్తను అల్లుడు దారుణంగా కొట్టి చంపిన ఘటన కేవీ పల్లి మండలంలో చోటుచేసుకుంది. కేవీ పల్లి వగళ్ల గ్రామం నార్మకలపల్లికి చెందిన సురేశ్ భార్య నీలవతి(46)ను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేవీ పల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.