'వరకట్నం తెమ్మని వేధిస్తే కఠిన చర్యలు'
SKLM: వరకట్నం వస్తు రూపంలో గానీ ధన రూపంలో గానీ తెమ్మని బాధిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న కార్యాలయంలో మహిళా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. అటువంటి సమస్యలున్నవారు సంప్రదిస్తే న్యాయపరమైన ఉచిత సలహాలు అందిస్తామన్నారు.