'సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

సత్యసాయి: పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని వారు పిలుపునిచ్చారు.