'పహల్గాంలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి'

'పహల్గాంలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి'

KNR: పహల్గాంలో జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం బార్ అసోసియేషన్ కోరుట్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో బైరి విజయ్ కుమార్ కొంపల్లి సురేష్, ముబీన్ పాషా, ఆడెపు వినోద్, శ్రీనివాస్, నవీన్ న్యాయవాదులు పాల్గొన్నారు.