'కష్టపడి చదివి అన్ని రంగాలలో ముందుకు రావాలి'
NTR: నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో జయప్రద ఫౌండేషన్ తరపున విద్యార్థులకు ఉచిత కళ్ళజోళ్ళ, ఇంగ్లీష్ డిక్షనరీ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థినీ విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కష్టపడి చదివి అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆశీర్వదించారు.