హుస్నాబాద్‌లో ప్రేమ జ్యోతికి ఘనస్వాగతం
SDPT: హుస్నాబాద్ పట్టణానికి చేరుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 'ప్రేమ జ్యోతి'కి గాంధీ చౌరస్తా వద్ద భక్తులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సాయి మందిరంలో ప్రత్యేక భజనలు నిర్వహించారు. జిల్లా మహిళా కన్వీనర్ యమునారాణి మాట్లాడుతూ.. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన ఈ జ్యోతిని దర్శించుకోవడం, స్వయంగా స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యమని తెలిపారు.