డుమ్మాకొట్టిన సిబ్బందికి మెమోలు

విశాఖ: విధులకు డుమ్మాకొట్టిన సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో చంద్రరావు మెమోలు జారీ చేశారు. మండలంలోని తామరం, మాకవరపాలెం గ్రామ సచివాలయాలని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ పరిశీలించిగా కొందరు సిబ్బంది విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి మెమోలు జారీ చేసినట్టు ఎంపీడీవో తెలిపారు.