'మా సమస్యలను పరిష్కరించండి'

KRNL: నగర శివారు ప్రాంతంలో ఉన్న ఎన్జీవోస్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు ఆదివారం కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ రామయ్యను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్జీవోస్ కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓబులేసు, సెక్రటరీ హుస్సేన్ మాట్లాడారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు.