బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కంప్లైంట్ చేసింది. పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ టీమ్ తరఫున కాంగ్రెస్ నాయకులు స్టేట్ సీఈవోకు ఫిర్యాదు లెటర్ ఇచ్చారు. సంజయ్ మాట్లాడిన మాటలు ఎన్నికల నియమాలు(కోడ్) ఉల్లంఘించినట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.