VIDEO: ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న ప్రజలు
కృష్ణా: గుడివాడలో బుధవారం చల్లటి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఉన్న వేడి తగ్గి, ఉదయం నుంచి మబ్బులతో కూడిన చల్లని గాలులు వీయడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంత తగ్గడంతో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. చల్లటి గాలులు వీయడం వల్ల బయటకు వచ్చిన ప్రజలు సౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు.