బాంబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహించిన చైనా

బాంబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహించిన చైనా

అమెరికా, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ నౌకాదళ విన్యాసాలు చేపట్టడంపై చైనా అభ్యంతరం తెలిపింది. దీనికి ప్రతి చర్యగా వివాదాస్పద ప్రాంతంలో తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా రెచ్చగొట్టే, ఉద్రిక్తతలు పెంచే చర్యలు మానుకోవాలని ఫిలిఫ్పీన్స్‌కు హితవు పలికింది. పెట్రోలింగ్ విషయాన్ని చైనా ఆర్మీ ధృవీకరించింది.