VIDEO: గుంతకల్లులో 'నషా ముక్త్ భారత్' కార్యక్రమంపై అవగాహన

ATP: గుంతకల్లులోని BC హాస్టల్‌లో ఆదివారం 'నషా ముక్త్ భారత్' కార్యక్రమం జరిగింది. ఆ నలుగురు సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు మంజుల వెంకటేష్ మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని కోరారు. యువశక్తి దేశ నిర్మాణంలో కీలకమని తెలిపారు. వ్యసన రహిత సమాజమే సువర్ణ భారత్ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు.