గంభీరం వద్ద 11 మంది అరెస్టు
VSP: అనందపురం మండలంలోని గంభీరం వద్ద పేకాట ఆడుతున్న 11 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.60 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆనందపురం పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కర్ రావు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే టాస్క్ ఫోర్స్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.