INSPIRATION: కోనేరు హంపి

INSPIRATION: కోనేరు హంపి

భారతదేశపు చదరంగ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి. ఫైడ్ ఎలో రేటింగ్‌లో మహిళా చదరంగంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారత తొలి చెస్ క్రీడాకారిణి హంపి. 2002లో 15 సంవత్సరాల 1 నెల 27 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్రం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు పొందింది.