వెంకటరాజు సేవలు అభినందనీయం: DCMS
VKB: జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (DCMS) పరిగి బ్రాంచ్‌లో 38 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన బట్టు వరకవి వెంకటరాజు మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా మేనేజర్ వెంకట్ రెడ్డి పాల్గొని వెంకటరాజును ఘనంగా సన్మానించారు. సంస్థ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు.