భీమవరం: 'ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వండి.. పిల్లల్ని స్కూలుకు పంపుతాం

W.G: వీరవాసరం మండలం పెరికపాలెం గ్రామానికి చెందిన బేడ, బుడగ జంగాల చెందిన నాయకులు పెద్ద ఎత్తున భీమవరం కలెక్టరేట్ చేరుకున్నారు. తమకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలంటూ కలెక్టర్ నాగరాణికి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె స్కూలుకు వెళ్లకుండా ఉన్న విద్యార్థులను పిలిచి వారితో మాట్లాడారు. వారిని స్కూలుకి పంపించాలని తల్లిదండ్రులకు చెప్పారు.