అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరి: కలెక్టర్

అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరి: కలెక్టర్

ASR: జిల్లా అభివృద్ధికి అధికారుల కోఆర్డినేషన్, కోఆపరేషన్ తప్పనిసరని జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి సోమవారం కలెక్టరేట్‌లో పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే జిల్లాలోని అన్ని శాఖల అధికారుల మధ్య పూర్తిస్థాయి సమన్వయం, సహకారం ఉండాలన్నారు. అధికారులకు శాఖపరమైన అవగాహన ఉంటే వారు చేపట్టే పనులు సులభతరం అవుతాయన్నారు.