ఇంటర్‌నేషనల్ పోటీలకు ఎంపికైన కర్లపాలెం విద్యార్థిని
కర్లపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి ఇంటర్‌నేషనల్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పోటీల్లో కర్లపాలెంకు చెందిన శర్వాణి సత్తా చాటి ఇంటర్‌నేషనల్ పోటీలకు ఎంపికైంది. ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలో జరిగే పోటీల్లో విద్యార్థి పాల్గొననుంది. ఆమెను శుక్రవారం కర్లపాలెంలోని ఓ క్లబ్ సభ్యులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.