నేడు ఢిల్లీ పర్యటనలో ఎంపీ లావు

GNTR: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కొన్ని ముఖ్య సమావేశాలు కారణంగా ఢిల్లీ వెళ్లినట్లు నరసరావుపేటలోని ఎంపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. సోమవారం, మంగళవారం ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు అందుబాటులో ఉండరని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.