వినాయక చవితి సందర్భంగా భద్రతా చర్యలు: ఎస్పీ

WNP: వివాదాస్పద ప్రదేశాలలో రహదారులకు అడ్డుగా లేదా వాహన రాకపోకలకు అడ్డంకి కలిగే ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేయరాదని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలకు సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.