'ఇళ్లు నిర్మించడంలో BRS విఫలమైంది'
KMM: కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అండగా ఉంటూ ప్రజా ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించడంలో గత ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. ఐదు విడతల్లో నిరుపేదలకు ఇందిర్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.