'ITDA పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ'
ADB: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ITDA పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ITDA PO యువరాజ్ మంగళవారం తెలిపారు. వివరాలను ITDA కార్యాలయం రోజువారీగా సమీక్షిస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.