రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

CTR: కార్వేటినగరం(M) అన్నూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చాకలివానిగుంట గిరిజన కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్య బిడ్డలతో కలిసి స్కూటర్‌పై పళ్లిపట్టు బయలుదేరాడు. KM పురానికి చెందిన మరో వ్యక్తి బైకుతో వీరిని ఢీకొట్టాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.