రన్‌వే‌పై నిలిచిన ఇండిగో విమానం

రన్‌వే‌పై నిలిచిన ఇండిగో విమానం

TPT: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన ఆ విమానం తిరిగి బయలుదేరే సమయంలో రన్‌వే‌పై ఆగిపోయింది. పైలట్లు లోపాన్ని గుర్తించి విమానాన్ని ఆపడంతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొంది. విమానాశ్రయం సాంకేతిక బృందం మరమ్మతులు చేపట్టింది.