ఒక్కరోజే గడువు.. డీజీపీ కీలక ప్రకటన
TG: మావోయిస్టులకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. లొంగిపోవడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఒక్కరోజే మిగిలి ఉందని, తక్షణమే ఆయుధాలు వీడి కుటుంబాల దగ్గరకు రావాలని కోరారు. గత రెండేళ్లలో 721 మంది లొంగిపోయారని, ప్రస్తుతం ఆరుగురు తెలంగాణ మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న గణపతి లొంగిపోతే HYDలో మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.