మున్సిపలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
SRPT: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందని స్పష్టం చేశారు.