ఫామ్ హౌస్‌కు గులాబీ అభ్యర్థులు తరలింపు!
సూర్యాపేట మున్సిపాలిటీలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ప్రత్యర్థుల ఎత్తుగడలకు చిక్కకుండా ఉండేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. 45 మంది అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్ ‘క్యాంపు’కు తరలించారు. కౌంటింగ్ రోజే వీరు తిరిగి రానున్నట్లు సమాచారం.