ఢిల్లీ పేలుడు ప్రాంతంలో బులెట్ లభ్యం!
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది మృతిచెందగా.. చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రలను LNGP ఆస్పత్రిలో చేర్చారు. ఈ పేలుడు తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు తనిఖీ చేస్తుండగా రోడ్డుపై బులెట్ కనిపించింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు.